ఫలానా చోట రాజధానికి వ్యతిరేకమని. నేనెప్పుడైనా అన్నానా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫలానా చోట రాజధానికి వ్యతిరేకమని. నేనెప్పుడైనా అన్నానా?

ఫలానా చోట రాజధానికి వ్యతిరేకమని. నేనెప్పుడైనా అన్నానా?

Written By news on Thursday, August 21, 2014 | 8/21/2014

ఫలానా చోట రాజధానికి  వ్యతిరేకమని. నేనెప్పుడైనా అన్నానా?
ఈ బ డ్జెట్‌లో ఏపీ కొత్త రాజధాని ఎక్కడ పెడతారు, దానికోసం ఎంత కేటారుుస్తారో చెప్పనేలేదు. అసలా ప్రస్తావనే లేదు’’ అని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రాజధాని ఎక్కడుండాలనుకుంటున్నారు అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఈ విషయంలో తొలి నుంచీ నేను చెబుతున్నది ఒక్కటే. ఎక్కడ 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటుందో అక్కడ నిర్మించాలని చెబుతున్నాను. రాజధాని నగరం అంటే నడిబొడ్డు నుంచి ఎటు చూసినా 6 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉండాలి. కనీసం 144 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండాలని చెబుతున్నాను’’ అని చెప్పారు.

విజయవాడలో రాజధాని నిర్మాణానికి మీరు వ్యతిరేకమా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘నేనెప్పుడైనా ఆ మాట అన్నానా? ఫలానా చోట రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం అని చెప్పానా?’’ అని అన్నారు. ‘‘ఒక సామాన్యుడు లేదా ఒక ఉద్యోగి రాజధాని నగరంలో నివాసానికి ఇల్లు కొనుక్కోవాలంటే సాధ్యమవుతుందా? ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండే చోట రాజధాని
నిర్మించాలని అంటున్నాను. - వైఎస్ జగన్
 
Share this article :

0 comments: