
రైతులు, విద్యార్థులకు నిరాశపర్చిన బడ్జెట్ అని, రాష్ట్రం విడిపోతే సమస్యలుంటాయని అందరికీ తెలిసిన సంగతేనని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే గత ప్రభుత్వాలపై నిందలు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రణాళికా వ్యయం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కన్నా తక్కువగా ఉందన్నారు. ప్రణాళికా వ్యయం తగ్గించి చూపిస్తే రాష్ట్ర జీడీపీపై ప్రభావం చూపిస్తుందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని తాము అడుగుతున్నామన్నారు.
0 comments:
Post a Comment