హత్యారాజకీయాలు చేయొద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హత్యారాజకీయాలు చేయొద్దు

హత్యారాజకీయాలు చేయొద్దు

Written By news on Monday, August 18, 2014 | 8/18/2014

'హత్యారాజకీయాలు చేయొద్దు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులకు భద్రత లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి అసెంబ్లీలో చర్చకు పట్టుబడితే భయపడి తమపై ఎదురుదాడికి సిద్దపడుతున్నారని విమర్శించారు. నడిరోడ్డుపై పట్టపగలు మా ఎమ్మెల్యేపై దాడిచేసింది టీడీపీ నేతలకు గుర్తులేదా, మా నేతలకు బెదిరింపు కాల్‌ చేసింది నిజంకాదా అని ప్రశ్నించారు.

స్పీకర్ నియోజవర్గంలోనే మైనార్టీ ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అధికారం ఇచ్చింది హత్యారాజకీయాలు, గూండాయిజం చేయడానికి కాదని హితవు చెప్పారు. తమపై రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మాపై వేలెత్తి చూపేముందు ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలని సూచించారు. పరిటాల రవి హత్య గురించి మాట్లాడుతున్న టీడీపీ నాయకులు వంగవీటి రంగా హత్య దగ్గర నుంచీ చర్చకు సిద్ధమేనా అని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Share this article :

0 comments: