
వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత రెండు మేనిఫెస్టోలలోను రైతు రుణమాఫీ అంశాన్ని చంద్రబాబు ప్రముఖంగా ప్రస్తావించారని, దానిపై హామీ ఇచ్చినా బడ్జెట్ లో ఏమాత్రం కేటాయింపులు చేయకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. లక్షా 2 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానన్నచంద్రబాబు ఆ విషయంలో చేసింది శూన్యమన్నారు. బడ్జెట్ గురించి ఆశగా ఎదురుచూస్తున్న కోట్లాదిమంది రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారన్నారు. గృహ నిర్మాణ రంగానికి ఈ బడ్జెట్ లో కేటాయింపులు దారుణమని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో ప్రతి యేటా 7, 8 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి కేవలం రూ. 800 కోట్లు కేటాయించారన్నారు.
సాధారణంగా ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉంటే రాష్ట్ర పురోగతి బాగుంటుందని, కానీ ఇక్కడ మాత్రం ప్రణాళికేతర వ్యయాన్ని దాదాపు మూడురెట్లు ఎక్కువగా చూపించారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కూడా పడిపోయందని, ఈ రెండు జీడీపీపై ప్రభావం చూపుతాయని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణం ఎక్కడో, దానికి కేటాయింపులు ఎంత చేశారో అసలు బడ్జెట్‌లో ప్రస్తావించలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు.
0 comments:
Post a Comment