మనుషుల ప్రాణాలకన్నా ముఖ్యమైన సబ్జక్ట్ ఉంటుందా?: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మనుషుల ప్రాణాలకన్నా ముఖ్యమైన సబ్జక్ట్ ఉంటుందా?: వైఎస్ జగన్

మనుషుల ప్రాణాలకన్నా ముఖ్యమైన సబ్జక్ట్ ఉంటుందా?: వైఎస్ జగన్

Written By news on Tuesday, August 19, 2014 | 8/19/2014

మనుషుల ప్రాణాలకన్నా ముఖ్యమైన సబ్జక్ట్ ఉంటుందా?: వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన రెడ్డి
హైదరాబాద్: మనుషుల ప్రాణాలకన్నా ముఖ్యమైన సబ్జక్ట్ మరొకటి ఏదైనా ఉంటుందా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు  వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలన మొదలైన అతి కొద్ది కాలంలోనే వరుసగా జరుగుతున్న హత్యల గురించి శాసనసభలో జగన్ ప్రశ్నించారు. శాంతిభద్రతలపై  చర్చ కోరడం తప్పా అని ఆయన అడిగారు.  సభలో అన్ని అంశాలను చర్చిస్తామని, అయితే మనుషుల ప్రాణాలకన్నా ముఖ్యమైన అంశం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలో జరిగిన హత్యల గురించే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు.

 అధికార సభ్యులు జగన్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. దాంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. జగన్ ను ప్రసంగించనువ్వకుండా మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు అడ్డుతగిలారు. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డిని, కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం జగన్ లేవనెత్తిన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు గతంలో జరిగిన హత్యల ప్రస్తావన తెచ్చారు.

గందరగోళ పరిస్థితులలో ఏపి శాసనసభను స్పీకర్ కోడెల శివప్రసాద్ రేపటికి వాయిదా వేశారు. రేపు ఉదయం 9 గంటలకు వాయిదావేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


Share this article :

0 comments: