
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ నిర్వహణ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కనుసన్నల్లో శాసనసభ నడుస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలినాని ఆరోపించారు. ప్రస్తుత సభ నడుస్తున్న తీరును గతంలో నేనెప్పుడూ చూడలేదు అని కొడాలినాని వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పూర్తిగా టీడీపీ మనిషిగా వ్యవహరిస్తున్నారని నాని విమర్శించారు. అన్ని అంశాలనూ ప్రజల ముందుకు తీసుకొస్తారనే వైఎస్ జగన్‌ను మాట్లాడనీయడం లేదని కొడాలినాని అన్నారు. సభలో ప్రతిపక్షనాయకుడు మాట్లాడుతుంటే 17 సార్లు మైక్ కట్ చేయడం గతంలో ఎన్నడూ చూడలేదని కోడాలినాని ఆవేదన వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment