విజయవంతంగా వైఎస్ జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయవంతంగా వైఎస్ జగన్ పర్యటన

విజయవంతంగా వైఎస్ జగన్ పర్యటన

Written By news on Sunday, August 10, 2014 | 8/10/2014

అందరితో ఆప్యాయంగా...
 - పలు అంశాలపై చర్చించిన ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్
- కడపలో అంజాద్.. బద్వేలులో జయరాములు మాటామంతి
- మూడు రోజుల పర్యటన విజయవంతం

 సాక్షి, కడప : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వందలు, వేలల్లో  కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చినా ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురి చేయకుండా ఆప్యాయంగా పలుకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు  వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్‌ఆర్ జిల్లా మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 7వ తేదీన పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ తొలి రోజు నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. 8వ తేదీ పలు శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించిన వైఎస్ జగన్‌రెడ్డి అనంతరం ప్రజలతో కలిసిపోయి సమస్యలు తెలుసుకున్నారు.

పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న వైఎస్ జగన్‌రెడ్డిని శనివారం ఉదయం ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు కలిసి చర్చించారు. జిల్లా పరిషత్‌కు సంబంధించిన అంశాలతోపాటు పలు సమస్యలపై వారు మాట్లాడుకున్నారు.  పలువురు ఎమ్మెల్యేలు కూడా జగన్‌ను ఈ సందర్భంగా  కలుసుకున్నారు. పులివెందుల నుంచి నెల్లూరుకు బయలుదేరిన వైఎస్ జగన్‌ను మార్గమధ్యలో కడప వద్ద ఎమ్మెల్యే అంజాద్ బాషా కలుసుకుని  చర్చించారు. బద్వేలులో ఎమ్మెల్యే జయరాములు తదితరులు జగన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

నూతన జంటకు ఆశీర్వాదం :
పులివెందులలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం అంకాలమ్మ గూడూరుకు చెందిన కక్కిరెడ్డి పురుషోత్తమరెడ్డి కుమార్తె నవ్యత, రాఘవేంద్రారెడ్డి వివాహానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కూడా  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 
విజయవంతంగా వైఎస్ జగన్ పర్యటన :
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటన జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో దాదాపు మూడు రోజులపాటు ఉండి కార్యకర్తలు, నాయకుల సమస్యలకు పరిష్కారం చూపడంతో వారిలో నూతనోత్సాహం  నెలకొంది. అండగా ఉంటానని.. ధైర్యంగా ముందుకు సాగాలని.. పార్టీపరంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని వైఎస్ జగన్ హితబోధ చేశారు.
 
అధైర్య పడవద్దు.. అండగా ఉంటా..
బద్వేలు : ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కడప జిల్లా పర్యటన ముగించుకుని బద్వేలు మీదుగా శనివారం నెల్లూరుకు బయలుదేరిన వైఎస్ జగన్‌ను ఎమ్మెల్యే జయరాములుతో పాటు పలువురు నాయకులు మండలంలోని బయనపల్లె సమీపంలో కలిశారు. ముఖ్యనేతలను ఎమ్మెల్యే జయరాములు జగన్‌కు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారన్నారు. మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ సింగసాని గురుమోహన్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అంబవరం వెంకటేశ్వరరెడ్డి పలువురు సర్పంచులు జయసుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, జయరామిరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, విజయభాస్కరరెడ్డి తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
Share this article :

0 comments: