చిన్నాన్న కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిన్నాన్న కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్

చిన్నాన్న కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్

Written By news on Thursday, August 14, 2014 | 8/14/2014


చిన్నాన్న కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన రెడ్డి
కడప: వైఎస్ఆర్ జిల్లా  పులివెందులలో ఈ ఉదయం జరిగిన తన చిన్నాన్న వైఎస్ జోసఫ్‌ రెడ్డి కుమార్తె వీణ, పవన్‌ కుమార్‌ రెడ్డిల వివాహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు.   నూతన  వధూవరులను ఆశీర్వదించారు.  విజె ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ వివాహానికి  వైఎస్ జగన్ తల్లి విజయమ్మ,  భార్య  వైఎస్‌ భారతి,  సోదరి షర్మిల,  మరో చిన్నాన్న వివేకానంద రెడ్డితోపాటు  అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

వైఎస్ పాల్ రెడ్డి ఫంక్షన్ హాలులో ఈ రాత్రికి జరిగే మరో వివాహానికి కూడా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో సహా హాజరవుతారు. ఈ రాత్రికి జగన్ పెదనాన్న, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ మధురెడ్డి చిన్న కుమారుడు అభినవ్ రెడ్డి, వధువు కృష్ణచైతన్యల వివాహం జరుగుతుంది. ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. రాత్రికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైలులో జగన్  హైదరాబాద్ బయలుదేరతారు.
Share this article :

0 comments: