వైఎస్సార్‌సీపీ నేత కుటుంబ సభ్యులపై హత్యాయత్నం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ నేత కుటుంబ సభ్యులపై హత్యాయత్నం

వైఎస్సార్‌సీపీ నేత కుటుంబ సభ్యులపై హత్యాయత్నం

Written By news on Wednesday, August 20, 2014 | 8/20/2014

వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం ప్యారంపల్లెకు చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత ఆవుల నాగభూషణ్‌రెడ్డి కుటుంబ సభ్యులపై మంగళవారం టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నాగభూషణ్‌రెడ్డి కుమారుడు హరీష్‌కుమార్‌రెడ్డి, అన్న కుమారుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, అన్న పుల్లారెడ్డిలు రాయచోటి నుంచి మంగళవారం సాయంత్రం వాహనంలో గాలి వీడుకు బయలుదేరారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రత్యర్థులు సుమారు పది మంది వాహనాల్లో వెంబడించారు. రామాపురం సమీపానికి  రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనానికి టీడీపీ నేత దివాకర్‌రెడ్డి తన వాహనాన్ని అడ్డంగా ఉంచాడు. అతని వాహనంలో ఉన్నవారు తమ వెంటతెచ్చుకున్న కర్రలతో నాగభూషణ్‌రెడ్డి కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు.

బండరాళ్లతో కారును ధ్వంసం చేశారు. స్థానికులు గమనించి ప్రతిఘటించడంతో దివాకర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన పుల్లారెడ్డి, హరీష్‌కుమార్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌రెడ్డిలను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వీరిని తిరుపతికి తీసుకెళ్లారు. టీ డీపీ నాయకులు ఈశ్వర్‌రెడ్డి, ధర్మారెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రతాప్‌రెడ్డిల ప్రోద్బలంతోనే దివాకర్‌రెడ్డి కిరాయి వ్యక్తులతో నాగభూషణ్‌రెడ్డి కుటుంబ సభ్యులను హతమార్చేందుకు పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Share this article :

0 comments: