వైఎస్‌ఆర్ సీపీని మరింత బలోపేతం చేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ సీపీని మరింత బలోపేతం చేయండి

వైఎస్‌ఆర్ సీపీని మరింత బలోపేతం చేయండి

Written By news on Wednesday, August 27, 2014 | 8/27/2014


వైఎస్‌ఆర్ సీపీని  మరింత బలోపేతం చేయండి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కలిసికట్టుగా పని చేసి పార్టీని మరింత పటిష్ట పరచాలని జిల్లా నాయకులకు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్భోదించారు.  క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, నాయకులను సమన్వయపరిచి పార్టీని ముందుకు న డిపించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియూమితులైన కోలగట్ల వీరభద్రస్వామికి సూచించారు.  కమిటీలు వేసి రానున్న రోజుల్లో పార్టీ విషయానికి కృషి చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడిగా కోలగట్ల వీరభద్రస్వామి నియామకం ఖరారు చేసిన సందర్భంగా జిల్లా పార్టీ నాయకులంతా మంగళవారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసారు. కోలగట్లను అభినందించిన జగన్‌మోహన్‌రెడ్డి, అందరినీ కలుపుకొని జిల్లాలో పార్టీని మరింత పటిష్టపరచాలని సూచించారు.

 ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేరుస్తానని, పదవికి న్యాయం చేస్తూ జిల్లాలో నాయకులు, కార్యకర్తల సహకారంతో, సమన్వయంతో పనిచేస్తానని  చెప్పారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని వారికి ప్రతి విషయంలో అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేవిధంగా, పార్టీ జెండా జిల్లాలో రెపరెపలాడే విధంగా కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణా రంగారావు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లాన చంద్రశేఖర్, జమ్మాన ప్రసన్నకుమార్, అంబళ్ల శ్రీరాములనాయుడు, నెక్కల నాయుడుబాబు, పతివాడ అప్పలనాయుడు, అవనాపు విజయ్, చనుమల్ల వెంకటరమణ, కోలగట్ల ప్రతాప్ తదితరులున్నారు.

 రేపు జిల్లాకు రానున్న కోలగట్ల :
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియూమితులైనకోలగట్ల వీరభద్రస్వామి ఈ నెల 28న జిల్లాకు రానున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కోలగట్లకు ఘనంగా స్వాగతం పలికేందుకు   పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఏర్పాట్లు చేస్తున్నారు.
Share this article :

0 comments: