వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు

Written By news on Sunday, August 24, 2014 | 8/24/2014


వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు
హైదరాబాద్: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డికి ఇసుకు మాఫియా నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఓ బెదిరింపు లేఖ ఆదివారం మంగళగిరిలోని ఎమ్మెల్యే కార్యాలయానికి అందింది. దాంతో కార్యాలయ సిబ్బంది వెంటనే ఆ లేఖను ఎమ్మెల్యేకు అందజేశారు. దీంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇసుక తవ్వకాలు ఇటీవల కాలంలో మరింత జోరందుకున్నాయి. దాంతో ఆ వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నడుంబిగించారు. అది ఇసుకు మాఫియా ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి బెదిరింపు లేఖ అందుకున్నారు.
Share this article :

0 comments: