ఏనాడూ స్పీకర్ ను అగౌరవపరచలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏనాడూ స్పీకర్ ను అగౌరవపరచలేదు

ఏనాడూ స్పీకర్ ను అగౌరవపరచలేదు

Written By news on Tuesday, August 26, 2014 | 8/26/2014

ఏనాడూ స్పీకర్ ను అగౌరవపరచలేదువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : తాను ఏనాడూ స్పీకర్ ను అగౌరవ పరచలేదని, అలాంటి తనపై తెలుగుదేశం పార్టీ నేతలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం సమంజసం కాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ నెల 22వ తేదీన విలేకరులతో మాట్లాడినప్పుడు కూడా తమకు సమాన అవకాశం కల్పించాలని మాత్రమే కోరినట్లు ఆయన చెప్పారు. స్పీకర్‌ను అగౌరవపర్చాలని తనకు ఏనాడు లేదని తెలిపారు. అధికార పక్షం ఎన్నిసార్లు అసభ్య పదజాలం వాడినా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని మాత్రమే అన్నానని గుర్తు చేశారు.

కొంతమంది మంత్రులు కూడా వైఎస్ఆర్ సీపీ సభ్యులను 'పందికొక్కులు' అంటూ తీవ్ర అభ్యంతరకరమైన భాష ఉపయోగించారని, వాళ్లమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెవిరెడ్డి అన్నారు. తాను మాత్రం ఏరోజూ స్పీకర్ ను అగౌరవపరచలేదని చెప్పారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా మాత్రం స్పీకర్ ను ఉద్దేశించి వాళ్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారని, అలాంటివాళ్లు ఇప్పుడు తనమీద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడమేంటని ఆయన నిలదీశారు.
http://www.sakshi.com/video/news/i-did-not-insult-speaker-at-anytime-says-chevireddy-bhaskar-reddy-19284?pfrom=home-top-videos
ఇద్దరు వైఎస్ఆర్ సీపీ సభ్యుల సస్పెన్షన్
హైదరబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆర్.శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలను సభనుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగినంత కాలం.. వారిని సస్పెండ్ చేయాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

వారి సస్పెన్షన్ తీర్మానాన్ని అధికారపక్షం తక్షణం ఆమోదించింది. అయితే, ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్ సీపీ సభ్యులు తీవ్రంగా నిరసించారు. వెల్ లోకి దూసుకొచ్చి 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. 
Share this article :

0 comments: