
అయితే ఇందుకు విరుద్ధంగా టిడిపి నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. జారత పెద్ద కుమరేశన్ మొదలియార్ ప్రధాన హారతి ఇవ్వకూడదని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఈ తోపులాటలో రోజా చేతిలోని హారతిపళ్లెంను మరోవర్గం వారు లాగేయటంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న నేతలకు పోలీసులు కూడా సహకరించటం బాధాకరమని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పథకం ప్రకారమే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
0 comments:
Post a Comment