
* ఆధార్‌కు పథకాలను లింకు చేయొద్దన్న సుప్రీం ఆదేశాలూ బేఖాతరా?
* అసలిది పేద ప్రజల ప్రభుత్వమా లేక కార్పొరేట్ల ప్రభుత్వమా?
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డుతో పేదల సంక్షేమ పథకాలకు లింకు వద్దని ఎన్నికలకు ముందు విమర్శించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇపుడు అదే ఆధార్‌తో బడుగు వర్గాల పథకాలను అనుసంధానిస్తారని వార్తలు రావడం ఆందోళనకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సంక్షేమ పథకాలను ఆధార్‌తో లింకు చేయడం వల్ల రూ.1089 కోట్లు ఆదా అవుతుందని టీడీపీ అనుకూల పత్రిక ఒకటి రాసిందని ఆమె ప్రస్తావిస్తూ... పేదల సంక్షేమంలో కోత విధిస్తున్నారంటే ఆ పత్రికకు ఎందుకంత సంతోషం, బడుగుల కడుపు కొడితే పత్రికలకు ఆనందమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘‘సంక్షేమ పథకాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయవద్దని ఈ ఏడాది మార్చి 3వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ చంద్రబాబు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయడయంలేదు. సబ్సిడీపై కోత విధించడమే సర్కారు ఉద్దేశమని స్పష్టమవుతోంది. అసలిది పేదల ప్రభుత్వమా, లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? ప్రజలు మనలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలని అని ఆలోచించిన ఒక రాజు గారు బాగా ఆలోచించి అన్నం పెడితే అరిగి పోతుంది...చీరలిస్తే చిరిగిపోతాయి, అందుకని కర్రు కాల్చి వాత పెడితే దానిని గుర్తుంచుకుంటారని అందరికీ వాతలు పెట్టారు. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితీ అలాగే ఉంది.’’ అంటూ ఆమె దుయ్యబట్టారు.
0 comments:
Post a Comment