Home »
» వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యుల ఘన నివాళి
వైఎస్ఆర్ కు కుటుంబ సభ్యుల ఘన నివాళి
ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అయిదో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు మంగళశారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు వైఎస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు వైఎస్ వర్థంతిని పురస్కరించుకుని పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను ప్రత్యేకంగా అలంకరించటంతో పాటు వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
0 comments:
Post a Comment