పార్టీ మారే ఉద్దేశం లేదు..అవన్నీ పుకార్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ మారే ఉద్దేశం లేదు..అవన్నీ పుకార్లు

పార్టీ మారే ఉద్దేశం లేదు..అవన్నీ పుకార్లు

Written By news on Thursday, September 25, 2014 | 9/25/2014

ఖమ్మం : తాను పార్టీ మారటం లేదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి, వ్యయప్రయాసలకోర్చి తనను ఎమ్మెల్యేను చేశారని, వారిని ఎన్నటికీ మోసగించనని ఆయన అన్నారు. బీఫాం ఇచ్చిన పార్టీని, వెన్నుదన్నుగా ప్రోత్సహించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానాన్ని ఏ పార్టీకి తాకట్టు పెట్టే ప్రసక్తే లేదన్నారు. 'తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నారు' అని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

వైఎస్ఆర్ సీపీ ఆవిర్భవించినప్పటి నుంచి కొన్ని మీడియా సంస్థల్లో ఇలాంటి వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.   తనపై ఈనెల 18న కుక్కునూరులో టీడీపీ నాయకుల దాడిపై సీఎం కేసీఆర్ కు వివరించానని, ఆయన స్పందించి పోలీస్ అధికారులతో మాట్లాడారని, రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. కుక్కునూరు, వేలేరుపాడు  మండలాల ప్రజలకు తానే ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు.
Share this article :

0 comments: