గెలిపించిన పార్టీని మోసం చేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గెలిపించిన పార్టీని మోసం చేశారు

గెలిపించిన పార్టీని మోసం చేశారు

Written By news on Thursday, September 25, 2014 | 9/25/2014


గెలిపించిన పార్టీని కొత్తపల్లి గీత మోసం చేశారు
హైదరాబాద్: అరకు ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేసి ... దమ్ముంటే తిరిగి అరకు ఎంపీగా గెలవాలని కొత్తపల్లి గీత కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ సవాల్ విసిరారు. ఎంపీటీసీగా కూడా గెలవలేని కొత్తపల్లి గీతను ఎంపీగా చేసిన ఘనత తమ పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్ దేనని ఆయన స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాల్లో వాటాలు, కమీషన్ల కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని కొత్తపల్లి గీతను ప్రసాద్ ఈ సందర్భంగా హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబంపై తప్పుడు ప్రకటనలు మానుకోకపోతే గిరిజనులే తగిన బుద్ధి చెబుతారని బొడ్డేడ ప్రసాద్ అన్నారు.
మహిళ అన్న ఉద్దేశంతో కొత్తపల్లి గీత ఇన్నాళ్లు ఏం మాట్లాడినా సహనంగా ఉన్నామన్నారు. గెలిపించిన పార్టీకి ద్రోహం చేయాలనుకునే ముందు అభాండాలు వేయడం సరికాదని గీతకు ఆయన హితవు పలికారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాలను మహిళలకు కేటాయించిన పార్టీ వైఎస్ఆర్ సీపీ అని ఆయన గుర్తు చేశారు.  అలాగే అరకు పార్లమెంట్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలను కూడా మహిళలకే కేటాయించారని తెలిపారు. వ్యక్తి అజెండా కోసం గెలిపించిన పార్టీని కొత్తపల్లి మోసం చేశారని ఆరోపించారు. గెలిపించిన గిరిజనులను కూడా గీత మోసం చేస్తున్నారని విమర్శించారు. సొంత ఇమేజ్ తోనే గెలిచానని కొత్తపల్లి గీత భృ఼విస్తే తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని గీతకు హితవు పలికారు. గెలిచే సత్తా ఉందా అని కొత్తపల్లి గీతను ప్రసాద్ ప్రశ్నించారు.
Share this article :

0 comments: