Home »
» ఎగనామం పెట్టి పండగ చేసుకుంటారా?
ఎగనామం పెట్టి పండగ చేసుకుంటారా?
హైదరాబాద్: వంద రోజుల సంబరాలు కాదు, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయామని సంతాప సభ చేసుకోండని టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. 24 గంటల విద్యుత్ హామీ రాష్ట్ర ఘనత కాదని, అది కేంద్రప్రభుత్వం ఇస్తున్న నజరానా అని వెల్లడించారు.అర్హులైనవారికి గత మూడురోజులుగా పెన్షన్‌లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పాతవారితో కలిసి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు, రైతులకు ఎగనామం పెట్టి ప్రభుత్వం పండగలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. హీరో ప్రాజెక్ట్ రాష్ట్రానికి రావడానికి వైఎస్ రాజశే్ఖరరెడ్డి అని చెప్పారు.
0 comments:
Post a Comment