అడ్డమైనవాటికీ రాజకీయాలేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడ్డమైనవాటికీ రాజకీయాలేనా?

అడ్డమైనవాటికీ రాజకీయాలేనా?

Written By news on Thursday, September 4, 2014 | 9/04/2014


అడ్డమైనవాటికీ రాజకీయాలేనా?
హైదరాబాద్ : ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారిపోయిందని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని నగరంపై ప్రకటన చేసిన తర్వాత దానిపై చర్చ సమయంలో వైఎస్ జగన్ సభలో లేరంటూ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

ఐదు నిమిషాల విరామం తీసుకోడానికి (రెస్ట్ రూంకు) వెళ్లిన సమయంలోనే ఇలా సభలో లేరంటూ రాజకీయం చేయడాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. చర్చలేకుండా ప్రకటన చేసేస్తారని, ప్రకటన తర్వాత చర్చ అంటారని.. కానీ ఇప్పుడు మాత్రం రెస్ట్ రూంకు వెళ్లినా సభలో లేరంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Share this article :

0 comments: