బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండి

బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండి

Written By news on Friday, September 12, 2014 | 9/12/2014

బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండి
హైదరాబాద్ : ఆర్థిక సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన ప్రతిపాదనల్లో ఏమాత్రం పస లేదని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి ప్రతిచోటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ నామస్మరణే సరిపోతోందని ఆయన అన్నారు. బహుశా చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందేమోనని, అందువల్ల ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడైనా మంచి ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. తాను కూడా గతంలో ఆయన వద్ద పనిచేసినవాడినే కాబట్టి, బాబు శ్రేయోభిలాషిగా ఈ మాట చెబుతున్నానన్నారు.

కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ చేస్తానని, మరికాసేపు ముంబై చేస్తానని ఆయన చెబుతున్నారని.. ఇప్పటికే సింగపూర్, ముంబై ఉన్నందున ఇప్పుడు ఆయన కొత్తగా చేయాల్సింది ఏమిటని తమ్మినేని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆర్థిక సంఘం వద్ద తమకు ఏయే అవసరాలకు ఎంతెంత నిధులు కావాలన్న విషయాలను నిర్మాణాత్మకంగా చెప్పి నిధులు తెచ్చుకోవాలని, అంతేతప్ప గత ప్రభుత్వాల మీద బురద చల్లడానికి కూడా ఈ వేదికనే ఉపయోగించుకోవడం సరికాదని తమ్మినేని అన్నారు.
Share this article :

0 comments: