Home »
» ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని భూమా శోభా నాగిరెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయినా, ఆమెను అభ్యర్థినిగానే పరిగణించి ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో దివంతగ శోభా నాగిరెడ్డి ఘన విజయం సాధించారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో మరణానంతరం గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు ఆమె సొంతం అయ్యింది.ఆ తర్వాత దేశంలోని 33 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ఇటీవల నిర్వహించినా, ఆళ్లగడ్డ స్థానం విషయం మాత్రం కోర్టులో ఉండటంతో అప్పట్లో నిర్వహించలేదు. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. అక్కడ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలను మాత్రం తుది తీర్పునకు లోబడి మాత్రమే వెల్లడించాలని హైకోర్టు తెలిపింది.
0 comments:
Post a Comment