కార్యకర్తలకు అండగా ఉంటాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్యకర్తలకు అండగా ఉంటాం

కార్యకర్తలకు అండగా ఉంటాం

Written By news on Tuesday, September 23, 2014 | 9/23/2014

కార్యకర్తలకు అండగా ఉంటాం
కొవ్వూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే ఉపేక్షించేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) హెచ్చరించారు. బాధితులకు తమతోపాటు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. వైసీపీ కొవ్వూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం స్థానిక జీఎస్ రావు కాపు కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు.

నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అధ్యక్షతన నిర్వహించిన  సమావేశంలో నాని మాట్లాడుతూ అసత్య హామీలతో గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం, ఆ హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు కార్యకర్తలు పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ పేరు చెప్పి రైతుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డుకీడ్చారని విమర్శించారు. జోలెపట్టి బిచ్చమెత్తి ఎంత మంది రైతులకు రుణమాఫీ చేస్తారని ప్రశ్నించారు. జిల్లాలో 3 లక్షలకు పైగా పింఛన్‌దారులు ఉన్నారని, ఏ ఒక్క పింఛన్‌దారుడిని తొలగించినా వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి పోరాటం సాగిస్తుందన్నారు.

చిత్తశుద్ధితో పనిచేసే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు
పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో మంచి గుర్తింపునిస్తామని నాని అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మండల, గ్రామ స్థాయి సమావేశాలు  నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీస్తున్నారని, బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గం అంకన్నగూడెంలో మాదిరిగా కార్యకర్తలపై అక్రమ కేసులు బనారుుంచటం పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చి వారికి బాసటగా నిలుస్తాయన్నారు. ఆళ్ల నానిని పెద్దేవం పార్టీ నాయకుల తరఫున జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి పట్టాభి రామారావు గజమాలతో సత్కరించారు.

తానేటి వనిత, జీఎస్ రావు, బొడ్డు అనంతవెంకటరమణ చౌదరిలను పూలమాలలతో సత్కరించారు.నిడదవోలు, గోపాలపు రం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త లు ఎస్.రాజీవ్‌కృష్ణ, తలారి వెంకట్రా వు, నిడదవోలు నియోజకవర్గ నాయకుడు జి.శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు పరిమి హరిచరణ్, ముదునూరి నాగరాజు, గూడా విజయరాజు, వర్రే శ్రీనివాస్, కాకర్ల నారాయుడు, దళిత విభాగం నాయకుడు ముప్పిడి విజయరావు, మాజీ ఎంపీపీ పీకే రంగారావు, గారపాటి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండల పార్టీ కన్వీనర్లు ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, బొర్రా కృష్ణారావు, పట్టణ కన్వీనర్ మైపాల విజయరామ్మోహన్ (రాంబాబు), నాయకులు యండపల్లి రమేష్‌బాబు, దేవగుప్తాపు లక్ష్మణరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ప్రజల తరఫున పోరాటం సాగిద్దాం.. జీఎస్ రావు
గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు అసత్య హామీలతో అధికారంలోకి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జీఎస్ రావు విమర్శించారు. అక్టోబర్ 16 నుంచి తహసిల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మోసపూరిత హామీలు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గుర్తించారని, త్వరలోనే ప్రభుత్వంపై తిరగబడతారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలను చేపడుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.

సంస్థాగతంగా పార్టీని  బలోపేతం చేద్దాం : వనిత
త్వరలో చేపట్టబోయే పార్టీ కమిటీల నియామకం ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్టు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తానేటి వనిత పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చే పిలుపు మేరకు చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో కార్యకర్తలంతా భాగస్వాములు కావాలని కోరారు. నూతనంగా నియమించే అన్ని కమిటీల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని వనిత పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

పార్టీపై ప్రజల్లో నమ్మకం పెంచాలి : వెంకటరమణ చౌదరి
నాయకుల కంటే పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరిగినప్పుడు విజయాన్ని ఆ పడం ఎవరితరం కాదని పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయర్త బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి నేడు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారని విమర్శించారు. 3 నెలలకే చంద్రబాబు పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిం దన్నారు. పింఛన్ కమిటీల పేరుతో అర్హులైన పింఛన్ లబ్ధిదారులను తొల గిస్తున్నారని, వారందరికి పార్టీ శ్రేణు లు అండగా నిలవాలని సూచించారు.
Share this article :

0 comments: