ఎన్నికల్లో కష్టపడిన వారికి జిల్లా కమిటీల్లో స్థానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికల్లో కష్టపడిన వారికి జిల్లా కమిటీల్లో స్థానం

ఎన్నికల్లో కష్టపడిన వారికి జిల్లా కమిటీల్లో స్థానం

Written By news on Saturday, September 27, 2014 | 9/27/2014

బలమైన శక్తిగా ఎదగాలి
- ఎన్నికల్లో కష్టపడిన వారికి జిల్లా కమిటీల్లో స్థానం
- వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ధర్మాన
- రాష్ట్రంలో విజయనగరాన్ని ఆదర్శంగా తీసుకునేలా పనిచేయాలి: జ్యోతుల
- పార్టీ బలోపేతంలో కమిటీలు కీలక పాత్ర పోషించాలి :  సుజయ్
-  ఐక్యతతో ముందుకు సాగుతా : కోలగట్ల
విజయనగరం మున్సిపాలిటీ : 
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టించి పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మనం ప్రజల పక్షాన నిరంత పోరాటం చేయాలన్నారు. తద్వారా ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరగటంతో పాటు రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని  అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కోలగట్ల వీరభద్రస్వామి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి గా పట్టణ శివారులో శుక్రవారం జిల్లా పార్టీ విస్తృత స్థా యి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమావేశానికి ముఖ్యఅతిథిగా  హాజ రైన ధర్మాన మాట్లాడుతూ గత ఎన్నికల్లో పార్టీ  ఓడిపోలేదని, గతంలో అధికారంలోకి  ఉండి ఇప్పుడు రాకపోతే దానిని ఓటమి అంటారన్నారు. నాలుగేళ్ల క్రితం స్థాపించబడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  అంచెలంచెలుగా ఒక శాసనసభ స్థానం నుంచి 65 స్థానాలకు ఎది గిందన్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అప్పుడు తప్పకుండా అధికారంలోకి వస్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మనం ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం ప్రశ్నిస్తూ ఉండాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించటం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని, హమీల అమల్లో వెనుకంజలో ఉండే  అధికార పార్టీకి  ఆదరణ తగ్గుతుందని ఈ విషయాన్ని అవగతం చేసుకుని పార్టీ నాయకులు పని చేయాలన్నారు.

సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ శాసనాసభా పక్ష ఉప నేత  జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కోలగట్ల హయాంలో విజ యనగరం జిల్లా పార్టీ బలోపేతం అవుతుందని ఇది ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటినుంచే అడుగు లు వేయాలన్నారు. నాయకత్వ లోపాలను సరిదిద్దు కోవాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు బాధ్యతగా పని చేస్తూ ప్రభుత్వ ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగు లు వేయాలన్నారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సుజయ్‌కృష్ణారంగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు పార్టీకి ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష పాత్రను గౌరవంగా స్వీకరించటంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

పార్టీ కేంద్ర పాలక మం డలి సభ్యుడు  పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ గతం వరకు జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, తాజాగా నియమితులైన కోలగట్ల నాయకత్వంలో పార్టీ సేవలందిస్తానన్నారు. రుణమాఫీ విషయంలో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు.  మరో కేంద్రపాలక మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడంతో పాటు పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు పని చేయాలన్నారు. పార్టీ విశాఖపట్నం  జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందన్న నిరుత్సాహం చెందవద్దని, నూతనోత్సాహంతో పని చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే నాయకత్వం బలపడుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మెసాలపై ప్రతిఘటించేందుకు ప్రతి కార్యకర్త సిద్దం కావాలన్నారు.  విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ తప్పుడు హమీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం 100 రోజుల పాలనలో కమిటీల పేరుతో కాలయాపన చేసిందన్నారు.  గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కోసం 24 గంటలు పని చేసే  కోలగట్ల వంటి నాయకుడు జిల్లా పగ్గాలుచేపట్టడం శుభసూచికంగా చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు మాట్లాడుతూ పది మంది పొట్టకొట్టి ఒక్కడికి కట్టబెట్టే విధంగా ప్రభుత్వం పింఛన్  మంజూరు విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టారు.  పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ మాట్లాడుతూ  అధికారంలోకి వస్తే జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రగడ్భాలు పలికిన టీడీపీ నాయకులు  బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు  అన్యాయం చేయటం ఎంత వరకు సమంజసమన్నారు. పార్టీ ప్రగతిని అడ్డుకునే వారిని పక్కన పెట్టి  పార్టీని అభివృద్ధి చేయాలన్నారు.
 
ఐక్యతతో ముందుగా సాగుతా : కోలగట్ల
పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ జిల్లాలో పార్టీ అభివృద్ధికి ముందుకు సాగుతానని పార్టీ జిల్లా అధ్యక్షుడు  కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ పదవి తనదొక్కడిదీ కాదని, అందరూ ఈ పదవిలో భాగస్వాములేనని అన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతలు మేరకు 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు.  జిల్లాలో పార్టీని బలోపేతం చేయటంలో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. బాధ్యతయుతంగా పార్టీ కోసం  సమయం కేటాయిస్తూ  పని చేసే వారికి జిల్లా,  మండలం, గ్రామ, వార్డు స్థాయి కమిటీల్లో స్థానం కల్పించటం జరుగుతుందన్నారు.  శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.

రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర   పార్టీ సూచన మేరకు వచ్చే నెల 16న  జిల్లాలో గల 34 మండలాల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట  ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడంతో పాటు ప్రతి మండలంలో, మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఒకటేనంటూ అధికార  పార్టీ నాయకులు చెప్పుకు తిరుగుతున్నారని అటువంటి అనుమానాలను పార్టీ నాయకులు పారద్రోలి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించటం ద్వారా జిల్లాలో పార్టీ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

సమావేశంలో పార్టీ  కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు బి.ప్రశాంత్, శ్రీకాకుళం జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్, ఎం.వి.పద్మావతి, మాఫెడ్ డెరైక్టర్ పులిరాజు, విజయనగరం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్,  మాజీ ఎమ్మెల్యే టి.విజయ్‌కుమార్, నెల్లిమర్ల నియోజకర్గ సమన్వయకర్త డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీటీసీ గెదల సన్యాసినాయుడు,  మాజీ ఎంపీపీ వర్రి నర్సింహమూర్తి, అల్లు కేశవజోగినాయుడు, కందుల రఘుబాబు, వేచలపు చినరామునాయుడు, ద్వారపురెడ్డి శ్రీనివాస్, గొర్లె వెంకటరమణ, అంబళ్ల శ్రీరాములనాయుడు, చనుమళ్ల వెంకటరమణ, పతివాడ అప్పలనాయుడు, మామిడి అప్పలనాయుడు, మజ్జి వెంకటేష్, జరజాపు సూరిబాబు, యల్లపు దమయంతిదేవి, అవనాపు విక్రమ్, కేతల వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: