రైతులకు అన్యాయం జరిగితే సహించం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులకు అన్యాయం జరిగితే సహించం

రైతులకు అన్యాయం జరిగితే సహించం

Written By news on Sunday, September 14, 2014 | 9/14/2014

రైతులకు అన్యాయం జరిగితే సహించం
నెల్లూరు (సెంట్రల్) : జిల్లాలోని రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో వారికి అన్యాయం జరిగితే సహించబోమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేక, మిల్లర్లు కొనుగోలు చేయక కల్లాల్లో ఉంచుకుని తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిస్తే పనికిరాకుండా పోతుందన్నారు. ఈ క్రమంలో మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు చోద్యం చూస్తూ మౌనం వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లాలో నెలకొన్న రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మిల్లర్లు కూడా మానవతాదృక్పథంతో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. రైతులను కష్టపెట్టడం సమజసం కాదని హితవు పలికారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లాకు చెందిన మంత్రికి చీమ కుట్టినట్లైనా లేదని పేర్కొన్నారు. 
 జిల్లాలోని ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా రైతుల  సమస్యలపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ సమస్యను అధికారులు, ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులు పండించిన ధాన్యం సహా తీసుకొచ్చి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లా మంత్రికి ఏమాత్రం రైతులపై చిత్తశుద్ధి ఉన్నా రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.  
Share this article :

0 comments: