టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న హత్యలు, దాడులకిది పరాకాష్ట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న హత్యలు, దాడులకిది పరాకాష్ట

టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న హత్యలు, దాడులకిది పరాకాష్ట

Written By news on Sunday, September 14, 2014 | 9/14/2014

రోజాపై దాడికి బాబు క్షమాపణ చెప్పాలి
టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న హత్యలు, దాడులకిది పరాకాష్ట   
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

 
హైదరాబాద్: మహిళా ఎమ్మెల్యే ఆర్.కె. రోజాపై ఆమె సొంత నియోజకవర్గంలోనే టీడీపీకి చెందిన గూండాలు చేసిన దాడికి బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. రోజా సొంత నియోజకవర్గంలో గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి హారతినివ్వడానికి రోజా వెళ్లినపుడు దాడి చే సి, ఆమెను గాయపర్చడం గర్హనీయమని ఆమె అన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పద్మ మీడియాతో మాట్లాడుతూ, దేవుడి కార్యక్రమానికి హాజరైన రోజాపై ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దాడి చేయడం చూస్తే గత నాలుగు నెలలుగా టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న దాడులు, హత్యలకు ఇది పరాకాష్ట అని అర్థమవుతోందన్నారు. దాడిలో గాయపడిన రోజా రక్తమోడుతున్నా ఆవేదనతో ధర్నాకు కూర్చున్నారని ఆ మె అన్నారు. మహిళలకు రాష్ట్రంలో భ ద్రత లేదనడానికి ఈ దాడులే నిదర్శనమని, టీడీపీ వారు మహిళలపై ఏం చేసినా చెల్లుబాటవుతుందని సందేశం ఇవ్వదలిచారా?అని ఆమె ప్రశ్నించారు.

సీఎం చేయిస్తున్నారు..

ముఖ్యమంత్రి తమ పార్టీ కార్యకర్తలకు కనుసైగలు చేయడం ద్వారానే ఈ దాడులు జరుగుతున్నాయని పద్మ విమర్శించారు. అమ్మవారికి హారతి ఇవ్వడానికి ప్రయత్నించిన మహిళా ఎమ్మెల్యే చేతులు, కాళ్లు నరికేస్తామన్నట్లు గూండాల్లాగా వ్యవహరిస్తున్న కార్యకర్తలు రాష్ట్రంలో ఉంటే ఇక పోలీసులు, చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం, ప్రభుత్వం ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. జరిగినదానికి వెంటనే పశ్చాత్తాపం ప్రకటించి చంద్రబాబు క్షమాపణ చెబితేనే వారి కార్యకర్తలను మందలించిన ట్లు అవుతుందని, లేదంటే ఈ దాడికి చంద్రబాబే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.

దాడిని నిరసిస్తూ ధర్నా

నగరి: చిత్తూరు జిల్లా నగరిలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. నగరి పట్టణంలో శుక్రవారం రాత్రి దేశమ్మ, ఓరుగుంటాలమ్మ గ్రామదేవతల ఊరేగింపు సందర్భంగా ప్రధాన హారతి విషయమై స్థానిక టీడీపీ నేత కుమరేశన్ మొదలియూర్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంలో కేజే కుమార్ తరఫున ప్రధాన హారతి ఇవ్వడానికి వచ్చిన ఎమ్మెల్యే రోజా చేతిలోని హారతి పళ్లేన్ని మరో వర్గానికి చెందిన వారు లాక్కోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. రోజాపై ప్రత్యర్థులు దాడి చేయడంతో ఆమె చేతికి గాయమైంది. ఈ సంఘటనను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు నల్ల రిబ్బన్లు ధరించి ర్యాలీ నిర్వహించి పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. నగరి డీఎస్పీ కష్ణకిషోర్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని, దౌర్జన్యానికి పాల్పడినవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదాశివరెడ్డి అలియాస్ జ్యోతిరెడ్డి, కష్ణారెడ్డి, బాలన్, బాబురెడ్డి, రమేష్, చిరంజీవులురెడ్డిపై 307,341 రెడ్‌విత్ 35 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని, రెండు రోజుల్లోపు వారిని అరెస్టు చేస్తామని  పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు అమర్‌నాథరెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కరుణాకర్ రెడ్డి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు.
 
మహిళా ఎమ్మెల్యేపై దాడి... హేయమైన చర్య: జగన్http://img.sakshi.net/images/cms/2014-09/71410469843_295x200.jpg
 
తమ పార్టీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ గూండాలు చేసిన దాడిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రోజాను ఫోన్‌లో పరామర్శించి జగన్ క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై దాడి చేయడం అనేది హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే ఒక మహిళా ఎమ్మెల్యేపై దాడి జరుగుతూ ఉంటే రక్షించలేకపోవడం వారి ఘోరవైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. 
Share this article :

0 comments: