నిర్మాణాత్మక సలహాలు ఇస్తాం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిర్మాణాత్మక సలహాలు ఇస్తాం: వైఎస్ జగన్

నిర్మాణాత్మక సలహాలు ఇస్తాం: వైఎస్ జగన్

Written By news on Thursday, September 4, 2014 | 9/04/2014


నిర్మాణాత్మక సలహాలు ఇస్తాం: వైఎస్ జగన్
హైదరాబాద్ : బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు నిర్మాణాత్మక సలహాలు ఇస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎలాగూ రాజధానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, అయితే భావోద్వేగాలకు తావివ్వకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో చర్చలో పాల్గొన్నామని ఆయన అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశం ఏ కోశానా తమకు లేదని, అందుకే విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు తాము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. రాజధానిని ఎక్కడైనా పెట్టినా అక్కడ 30వేల ఎకరాలు అందుబాటలో ఉండాలని వైఎస్ జగన్ అన్నారు.

ఆ 30వేల ఎకరాల ప్రభుత్వ భూమే ఉంటే భూమి రేటును నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. దీనివల్ల సామాన్యులు ఎవరైనా రాజధానికి వెళ్లి ఈఎంఐ పద్ధతిలో ఒక ప్లాటు కొనుక్కునే అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగస్తులకు అద్దెఇళ్లు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ భూమి అయితే రేటు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ల్యాండ్ ఫులింగ్ పద్ధతిలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించే పద్దతిలో వెళ్తుందన్నారు.
Share this article :

0 comments: