
వైఎస్.మృతి జిల్లా ప్రజలకు తీరని లోటని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పేదల గుండె చప్పుడు విని వారికి ఏం కావాలో అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. నిరుపేదల గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్ ప్రపంచంలోనే మహానేత అంటూ కొనియాడారు. వైఎస్ ఆశయసాధన కోసం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ఎప్పటికీ పోరాటం చేస్తుందని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇలా ప్రతి ఒక్కరూ వైఎస్ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందారని పినపాక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన మరణానంతరం పాలకులు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. తాను అశ్వారావుపేట నుంచి వస్తుంటే ప్రతి గ్రామంలోనూ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద పాలాభిషేకాలు, సేవా కార్యక్రమాలు చేశానని, దీనిని బట్టి వైఎస్‌పై ప్రజలు పెంచుకున్న ప్రేమ ఎంటో అర్థమవుతోందని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు.
అందరూ వెళ్లి స్థానిక రాపర్తినగర్‌లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాల సమన్వయకర్తలు కూరాకుల నాగభూషణం, డాక్టర్ గుగులోతు రవిబాబునాయక్, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి సాధు రమేష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు తోట రామారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కోటా గురుప్రసాద్, ప్రచార కమిటీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కాంపల్లి బాలకృష్ణ, జిల్లా నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, అడపా వెంకటనర్సయ్య, దామోదర్‌రెడ్డి, బండి సత్యనారాయణ, తుమ్మా అప్పిరెడ్డి, వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, హెచ్.వెంకటేశ్వర్లు, నెల్లూరి షర్మిలా సంపత్, కొంగర జ్యోతిర్మయి పాల్గొన్నారు.
పాలేరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం వైఎస్ వర్ధంతిని నిర్వహించారు. తిరుమలాయపాలెం మండలం బీరోలు పంచాయతీ బంధంపల్లిలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం, తాటి కలిసి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ పాలేరు నియోజకవర్గ నాయకులు రమేశ్‌రెడ్డి, కొప్పుల చెన్నకృష్ణారెడ్డి, తోట చినవెంకటరెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. బూడిదగడ్డలోని స్నేహలత వృద్ధాశ్రమం, స్నేహలత-సంధ్యలత అనాథాశ్రమంలో పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు. మండల పరిధిలోని వేపలగడ్డకు చెందిన కందుల సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు.
పట్టణ కన్వీనర్ భీమా శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్ భీమా శ్రీవల్లి ఆధ్వర్యంలో సెవెన్‌హిల్స్ ప్రాంతంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పండ్లు పంపి ణీ చేశారు. పాల్వంచ బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.
భద్రాచలం డివిజన్లోని అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్లో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎటపాకలోని సరోజ అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు,రొట్టెలు పంచారు.
అశ్వారావుపేటలోని ఆరు మండలాల్లో రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్, రింగ్‌సెంటర్‌లలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. దమ్మపేట మండల కేంద్రంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దమ్మపేట, మందలపల్లి, నాగుపల్లి, నాచారం, మొండివ ర్రె, పట్వారీగూడెం, ములకలపల్లి, చండ్రుగొండ, మద్దుకూరు గ్రామాల్లో వైస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పులిహోర పంపిణీ చేశారు.
బూర్గంపాడులోని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, కైపు సుబ్బిరామిరెడ్డి, బట్టా విజయగాంధీ, కైపు రోషిరెడ్డి మండల కేంద్రంలో అన్నదానం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకుపండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల మండలాల్లో అన్నదానం చేశారు. గజ్జల లక్ష్మారెడ్డి, కారం వెంకట్‌రెడ్డి, రమేష్, ఖదీర్ పాల్గొన్నారు.
మధిరలోని వైఎస్‌ఆర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ, బోనకల్లు మండలాల్లోని అన్ని గ్రామాల్లో వైఎస్‌ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. - ఇల్లెందులో వైఎస్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇల్లెందు, గార్ల ఏరియా వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
వైరా మండలంలో 20 గ్రామ పంచాయితీల్లో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలో వైస్సార్‌సీపీ నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కొణిజర్ల, ఏన్కూరు మండలంలో రోగులు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. జూలూరుపాడు, కారేపల్లి, మండలాల్లో వైఎస్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో ముక్తి వెంకటేశ్వర్లు, నల్లమల శివకుమార్, పూర్ణకంటి నాగేశ్వరరావు, ఇమ్మడి తిరుపతిరావు, సూరపురెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఈశ్వరి నందరాజ్, ముత్తినేని రామయ్య పాల్గొన్నారు.
సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాలలోని గ్రామాలలో వైఎస్‌ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. సత్తుపల్లిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆస్పత్రుల్లో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
0 comments:
Post a Comment