గణపవరంలో విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గణపవరంలో విజయమ్మ

గణపవరంలో విజయమ్మ

Written By news on Sunday, September 7, 2014 | 9/07/2014

గణపవరంలో విజయమ్మ
  • బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి సంస్మరణ సభకు హాజరు
మైలవరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ శనివారం గణపవరం జమీందారు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు. మైలవరం మండలం గణపవరం జమిందారు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.

పెద్ద కుమారుడు కుమార కోటిరెడ్డితో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్.రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ  వివాహం జరగడంతో వీరికి   బంధుత్వమేర్పడింది. మరో కుమారుడు బిమల్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్‌కు వైస్ ప్రసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ, వైఎస్. వివేకానందరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు.

పలువురు పార్టీ  నాయకులు ఆమెను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విజయమ్మను  కలిసిన వారిలో తలశిల రఘురామ్, జ్యేష్ఠ రమేష్‌బాబు, జోగి రమేష్, కాజా రాజకుమార్, అప్పిడి కిరణ్ కుమార్‌రెడ్డి, వేణుగోపాలరెడ్డి తదితరులున్నారు. అలాగే జగన్ అభిమానులు,  కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున వచ్చి విజయమ్మను కలుసుకుని అభిమానం చాటుకున్నారు.
Share this article :

0 comments: