Home »
» కొడికొండలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
కొడికొండలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొడికొండలోలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ జగన్ గురువారం అనంతపురం జిల్లా చేరుకున్నారు. ఆయన రెండు రోజుల పాటు జిల్లాలో పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.అనంతపురంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో పెనుకొండ, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం, మడకశిర, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు జిల్లాలో పార్టీ పరిస్థితులు, పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లా నియోజకవర్గ నేతలు హాజరు కానున్నారు.
0 comments:
Post a Comment