మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణ హత్య - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణ హత్య

మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణ హత్య

Written By news on Thursday, September 11, 2014 | 9/11/2014

 గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాలోని కారంపూడి మండలం చిన్నగార్లపాడులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోవిందరెడ్డిపై పచ్చపార్టీ కార్యకర్తలు కత్తులు, గోడ్డళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో గోవిందరెడ్డి రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి పరారైయ్యారు.
ఈ ఘటన గోవిందరెడ్డి ఇంటి ముందే చోటు చేసుకుంది. దాంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గోవిందరెడ్డి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు ఎవ్వరూ అటు వైపునకు రాకపోవడం గమనార్హం. గోవిందరెడ్డి హత్యతో జిల్లాలో టీడీపీ కార్యకర్తలు చేసిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల హత్యల సంఖ్య ఆరుకు చేరుకుంది.
Share this article :

0 comments: