చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్‌కుమార్‌లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశా రు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ తీరుపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం ఆయా వ్యక్తులకున్న ప్రాణహాని ఆధారంగా కాకుండా వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారనే విషయాన్ని బట్టి భద్రతను కల్పిస్తోందని వాదనల సందర్భంగా ఇటీవల ఓ న్యాయవాది చెప్పారు.
అప్పుడు దీనిని నేను నమ్మలేదు. కాని ఇప్పుడు ఈ వ్యాజ్యాలను (విజయమ్మ తదితరులు దాఖలు చేసినవి), అందులో లేవనెత్తిన అంశాలను చూస్తుంటే ఆ న్యాయవాది చెప్పిన మాట ల్లో నిజముందని భావించాల్సి వస్తోంది. రాజకీయ పార్టీలు, ఆ పార్టీలతో వ్యక్తులకున్న సంబంధాలను బట్టి భద్రత కల్పించడమన్నది ఓ రకంగా వివక్ష చూపడమే అవుతుంది. ఇది ఎంత మాత్రం సరికాదు. ఇటువంటి చర్యలు బాధితులకు ఎంతో ఇబ్బందిని కలిగి స్తాయి. వ్యక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించడమన్నది ప్రభుత్వ రాజ్యాంగ విధి. ప్రభుత్వం కేవలం ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలకు మాత్రమే ఎందుకు భద్రత తొలగిస్తోంది..?’’ అంటూ జస్టిస్ రామ్మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
అనర్హులకు భద్రత కల్పిస్తే తీవ్రంగా స్పందిస్తా...
తమకు 2004 నుంచి ఉన్న భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ విజయమ్మ, షర్మిల, అనిల్‌కుమార్‌లు బుధవారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరికన్నా ముందు జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు కూడా తమకున్న భద్రతను తొలగించడాన్ని, కుదించడాన్ని సవాలు చేస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరికి భద్రతను పునరుద్ధరించాలని ఇటీవలే న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా, వీటిని కూడా విజయమ్మ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలతో కలిపి విచారించారు. విజయమ్మ తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ... ముందస్తు నోటీసు జారీ చేయకుండానే ప్రభుత్వం భద్రతను ఉపసంహరించిందని, ప్రభుత్వ ఏకపక్ష చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. విజయమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందని, అందులో భాగంగానే వారికి 2004 నుంచి భద్రతను కొనసాగిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావడంతో వీరి భద్రతను అకస్మాత్తుగా తొలగించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
రాజకీయ దురుద్దేశాలతోనే ఇదంతా జరిగిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ‘‘పిటిషనర్లు చెబుతున్నట్లు జంట హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొని, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నేతకున్న భద్రతను 1+1 నుంచి 2+2కు పెంచుతారు. అతనిపై గెలిచిన అభ్యర్థికి మాత్రం భద్రతను 1+1కు తగ్గిస్తారా! ఈ విషయాలన్నింటినీ మీ అడ్వొకేట్ జనరల్‌కు చెప్పండి. ఈ కేసులన్నింటినీ నేను తదుపరి విచారణ నిమిత్తం సోమవారానికి వాయిదా వేస్తున్నా. అప్పుడు నేను పిటిషనర్ల భద్రత విషయంలో రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తా. ప్రస్తుతం భద్రత పొందుతున్న వారిలో అర్హులు లేరని తేలితే, దానిని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలకు ఉపక్రమిస్తా’’ అని ప్రభుత్వం తరఫున హాజరైన సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్‌కుమార్‌లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశా రు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ తీరుపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం ఆయా వ్యక్తులకున్న ప్రాణహాని ఆధారంగా కాకుండా వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారనే విషయాన్ని బట్టి భద్రతను కల్పిస్తోందని వాదనల సందర్భంగా ఇటీవల ఓ న్యాయవాది చెప్పారు.
అప్పుడు దీనిని నేను నమ్మలేదు. కాని ఇప్పుడు ఈ వ్యాజ్యాలను (విజయమ్మ తదితరులు దాఖలు చేసినవి), అందులో లేవనెత్తిన అంశాలను చూస్తుంటే ఆ న్యాయవాది చెప్పిన మాట ల్లో నిజముందని భావించాల్సి వస్తోంది. రాజకీయ పార్టీలు, ఆ పార్టీలతో వ్యక్తులకున్న సంబంధాలను బట్టి భద్రత కల్పించడమన్నది ఓ రకంగా వివక్ష చూపడమే అవుతుంది. ఇది ఎంత మాత్రం సరికాదు. ఇటువంటి చర్యలు బాధితులకు ఎంతో ఇబ్బందిని కలిగి స్తాయి. వ్యక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించడమన్నది ప్రభుత్వ రాజ్యాంగ విధి. ప్రభుత్వం కేవలం ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలకు మాత్రమే ఎందుకు భద్రత తొలగిస్తోంది..?’’ అంటూ జస్టిస్ రామ్మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
అనర్హులకు భద్రత కల్పిస్తే తీవ్రంగా స్పందిస్తా...

గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా, వీటిని కూడా విజయమ్మ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలతో కలిపి విచారించారు. విజయమ్మ తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ... ముందస్తు నోటీసు జారీ చేయకుండానే ప్రభుత్వం భద్రతను ఉపసంహరించిందని, ప్రభుత్వ ఏకపక్ష చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. విజయమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందని, అందులో భాగంగానే వారికి 2004 నుంచి భద్రతను కొనసాగిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావడంతో వీరి భద్రతను అకస్మాత్తుగా తొలగించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
రాజకీయ దురుద్దేశాలతోనే ఇదంతా జరిగిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ‘‘పిటిషనర్లు చెబుతున్నట్లు జంట హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొని, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నేతకున్న భద్రతను 1+1 నుంచి 2+2కు పెంచుతారు. అతనిపై గెలిచిన అభ్యర్థికి మాత్రం భద్రతను 1+1కు తగ్గిస్తారా! ఈ విషయాలన్నింటినీ మీ అడ్వొకేట్ జనరల్‌కు చెప్పండి. ఈ కేసులన్నింటినీ నేను తదుపరి విచారణ నిమిత్తం సోమవారానికి వాయిదా వేస్తున్నా. అప్పుడు నేను పిటిషనర్ల భద్రత విషయంలో రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తా. ప్రస్తుతం భద్రత పొందుతున్న వారిలో అర్హులు లేరని తేలితే, దానిని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలకు ఉపక్రమిస్తా’’ అని ప్రభుత్వం తరఫున హాజరైన సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment