ముంపు ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముంపు ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన

ముంపు ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన

Written By news on Monday, September 15, 2014 | 9/15/2014

ముంపు ప్రాంతాల్లో ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన
కుక్కునూరు: గోదావరి వరద ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి వరద ప్రభావిత గ్రామాలను సందర్శించారు. వరదల వల్ల దెబ్బతిన్న పాలవాగు చప్టా, వింజరం గ్రామంలో పొలాలకు వెళ్లే దారిపై ఏర్పడిన గుంతలను పరిశీలించారు.

వరద బాధితులను ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపు మండలాలకు అందించే పరిహారం, నిర్వాసితుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
 అనంతరం వరదల వల్ల దెబ్బతిన్న కుక్కునూరులోని రామసింగారం సెంటర్ నుంచి బస్టాండ్‌కు వెళ్లే రోడ్డు, దాచారానికి వెళ్లే దారిలో గుండేటివాగుపై లోలెవెల్ చప్టాను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు.

ఆంధ్రలో కలిసిన ముంపు మండలాలల్లో వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వరద బాధితులకు న్యాయం జరిగేంత వరకూ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్ర ప్రభుత్వంతో పోరాడతారని తెలిపారు.

 ఎకరానికి రూ. 25 వేలు అందించాలి : వేలేరుపాడు మండలంలోని తాట్కూరుగొమ్ము, తిర్లాపురం, రుద్రంకోట గ్రామాల్లో వరదల వల్ల దెబ్బతిన్న పత్తి, మిర్చి, వరి పంటలను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంపీ పొంగులేటి  డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పార్టీ  రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వరరావు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల కన్వీనర్లు కుచ్చర్లపాటి నరసింహరాజు, కేసగాని శ్రీనివాసగౌడ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, సర్పంచ్‌లు వర్సా లక్ష్మి, సోడె బుల్లెమ్మ, ఊకే రాధ, పొడియం వెంకటరమణ, జగిడి బాలరాజు, నాయకులు మన్యం సత్యనారాయణ, వెంక్నబాబు, రాజారావు, చిన రసింహరాజు,సూర్యనారాయణరాజు, రాజేశ్, వినోద్, రవి, రామారావు, మధు, శ్రీను, రామకృష్ణ, తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
 వీఆర్‌పురం : కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ముంపు  మండలాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిసి ఎంపీ ఆదివారం పర్యటించారు. వేలేరుపాడు మండలంలో పర్యటన ముగించుకున్న అనంతరం లాంచీపై వీఆర్‌పురం మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి చేరుకున్నారు.

 ఇటీవల వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అనంతరం వారితో మాట్లాడుతూ  ముంపు గురైయ్యే ప్రతి కుటుంబానికీ అత్యున్నతమైన ప్యాకేజీ అందేలా పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు  వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొం దించిందని విమర్శించారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముంపు ప్రాంత సమస్యలపై నివేదికను రూపొందించి ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఇవ్వనున్నామని చెప్పారు.

అనంతరం శ్రీరామగిరి, సీతపేట గ్రామాల్లోని వరదల  ప్రభావానికి దెబ్బతిన్న మిర్చి, వరి చేలను పరిశీలించారు. అప్పులు చేసి వ్యవసాయం చేసుకునే చిన్న సన్నకారు రైతులను వరద కోలుకోలేని దెబ్బతీసిందని అన్నారు. వరదలతో దెబ్బతిన్న మిర్చికి ఎకరాకు రూ.35 వేలు, వరికి ఎకరాాకు రూ. 25 వేలు నష్టపరిహారం ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చేలా పోరాడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ డివిజన్ నాయకుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కడియం రామాచారి, మంత్రిప్రగడ నరసింహరావు, మండల నాయకులు పొడియం గోపాల్, ముత్యాల శ్రీనివాస్, మాచర్ల గంగులు, బంధ విజయలక్ష్మి, రేవు బాలరాజు, కోలా బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: