
రుణమాఫీపై చంద్రబాబు చేశారా అని ఈ సందర్భంగా అంబటి సూటి ప్రశ్న వేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు 200 వాగ్ధానాలు చేశారని, పాదయాత్రలో మరో 300 వాగ్దానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటిదాకా చంద్రబాబు ఒక్క వాగ్దానాన్నీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎక్కడైనా అమలయిందా అని ప్రశ్నించారు. రూ.2కే మినరల్ వాటర్ ఎవరైనా ఇప్పటిదాకా తాగారా అన్నారు.
బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పిన బాబు ...మద్యం అమ్మకాలు ఎక్కడైనా తగ్గాయా .... పదవీ విరమణ వయస్సును ఎవరికి పెంచారని అంబటి ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు పరిపాలన అధ్వాన్నంగా ఉందే తప్ప...ఏమాత్రం మెచ్చుకోదగ్గ పాలన కొనసాగలేదన్నారు. రుణమాఫీ చేస్తానన్న బాబు... మాఫీ అమలు కోసం కమిటీ వేశారని, మరోవైపు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే మళ్లీ తను ఒక కమిటీ వేసి చంద్రబాబే ఏపీ రాజధానిని ప్రకటించారని అంబటి విమర్శించారు. శాసనసభలో చర్చ జరగకుండానే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.
0 comments:
Post a Comment