Home »
» బందోబస్తుతో ఎందుకు తిరగాల్సివస్తోంది?
బందోబస్తుతో ఎందుకు తిరగాల్సివస్తోంది?
తమ్మినేని సీతారాం(ఫైల్)
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత కారణంగా రాష్ట్ర రైతులు కుదేలయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేతగానితనంతో అన్నదాతలకు కనీసం పంటల బీమా కూడా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఫించన్లు ఐదు రెట్లు పెంచితే పాలకవర్గాలు పోలీసుల బందోబస్తుతో గ్రామాల్లో తిరగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు.
0 comments:
Post a Comment