తుపాను బాధితులకు కేంద్ర సాయం కోరాం:సుబ్బారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తుపాను బాధితులకు కేంద్ర సాయం కోరాం:సుబ్బారెడ్డి

తుపాను బాధితులకు కేంద్ర సాయం కోరాం:సుబ్బారెడ్డి

Written By news on Monday, October 20, 2014 | 10/20/2014


తుపాను బాధితులకు కేంద్ర సాయం కోరాం:సుబ్బారెడ్డి
ఢిల్లీ:తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్ర సాయాన్ని కోరినట్లు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుపాను బాధితులకు కేంద్ర సాయాన్ని కోరినట్లు తెలిపారు. పెను తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
 
ప్రకాశం జిల్లాలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని కోరినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరుపున జైట్లీ ఆరోగ్యపరిస్థితిని సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు.
Share this article :

0 comments: