
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా బుధవారం విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్, జాలారిపేట, ఆంధ్రా యూనివర్శిటీ, పెద్ద గదిలి, ధర్మవరం, తాడిచెట్లపాలెం, దుర్గగుడి, కొబ్బరితోట ప్రాంతాల్లో పర్యటించారు.
తుపాను బాధితులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని భవనాలకు వాటిల్లిన నష్టాన్ని కూడా ఆయన పరిశీలించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్నం చేరుకున్న సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment