తక్షణసాయం ప్రకటించండి: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తక్షణసాయం ప్రకటించండి: వైఎస్ జగన్

తక్షణసాయం ప్రకటించండి: వైఎస్ జగన్

Written By news on Tuesday, October 14, 2014 | 10/14/2014

తక్షణసాయం ప్రకటించండి: వైఎస్ జగన్
విశాఖపట్నం: తుపాన్ బాధిత కుటుంబాలకు తక్షణసాయంగా రూ. 5వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధ్వంసమైన మత్సకారుల పడవలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు. విశాఖ జిల్లాలో హుదూద్ తుపాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు.

కాగిత, పూడిమడక, పాలదిబ్బ, దుత్తితూరు గ్రామాలను ఆయన సందర్శించారు. అచ్యుతాపురం, పరవాడ, స్టీల్ ప్లాంట్ మీదుగా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తుపాన్ బాధితులతో మాట్లాడారు. పంటనష్టపోయిన రైతులను వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Share this article :

0 comments: