
కడప : ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ పార్టీలో చేరే కంటే శ్మశానంలో చేరడం మేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరుతున్నారంటూ పచ్చ పత్రికలు, టీడీపీతో కలసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. గురువారం కడపలో రాచమల్లు ప్రసాద్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమ పార్టీ ఎమ్మెల్యేలందరికి అత్యంత అభిమానం, విశ్వాసం ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరూ పార్టీని వీడేది లేదని రాచమల్లు ప్రసాద్ రెడ్డి తెలిపారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/rachamallu-prasad-reddy-takes-on-tdp-party-180263
0 comments:
Post a Comment