ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

Written By news on Wednesday, October 29, 2014 | 10/29/2014

ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు
 ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతోంది. అందుకు గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలను రూపొందించేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. సీఎం అయ్యాక అమల్లోకి వచ్చేసరికి చేస్తున్న గందరగోళ ప్రకటనలను ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో రోజుకో ప్రకటనతో మభ్యపెడుతూ.. హామీలను జనం మరచిపోయేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు మెడలు వంచాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంగళవారం నెల్లూరులో సర్వసభ్య సమావేశం నిర్వహించి ఉత్తేజ పరిచారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టాలని నిర్ణయించారు. అదే విధంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా తొలగించిన పింఛన్లు, తెల్లరేషన్‌కార్డులను పునరుద్ధరించేలా కృషి చేయాలని నిర్ణయించారు.

తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో అందిస్తానన్న శుద్ధి జలం ఏర్పాటు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు వచ్చేనెల 5న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు హామీలను విస్మరిస్తున్న వైనాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు క్షుణ్ణంగా వివరించారు.

మొదట వ్యవసాయ రుణాలని చెప్పి ఆ తర్వాత పంట రుణాలే మాఫీ అంటూ.. కుటుంబంలో ఒకరికిలక్షన్నర రూపాయలకు పరిమితం చేసిన తీరును ఎండగట్టారు. వ్యవసాయ సాధికారత కమిషన్ ఏర్పాటు చేయటం వల్ల రైతులకు వడ్డీ భారం తప్ప మరొకటి లేదని పార్టీ శ్రేణులకు అర్థం అయ్యేలా వివరించారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు బండారాన్ని బయటపెట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వచ్చే నెల 5న తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

చంద్రబాబు అబద్ధాల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రతి కార్యకర్తకు పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో విషయాలను ఎప్పటికప్పుడు కేంద్ర పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ సేవాదళాన్ని ప్రతి నియోజక వర్గంలో ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేలా  రూపొందిస్తున్నారు.

 పార్టీ పటిష్టతపైనా దృష్టి
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అధినేత దృష్టి సారించారు. ఇందు కోసం నియమించిన కమిటీ సభ్యులు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా పార్టీ అనుబంధ సంఘాలను సైతం కార్యవర్గంలో కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని నిర్ణయించారు.

అలాగే ప్రతి కార్యకర్త, అభిమానితో అధినేత వైఎస్ జగనమోహన్‌రెడ్డి నేరుగా సంప్రదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ మేరకు వారి పేర్లు, ఫోన్ నంబర్, అడ్రస్‌లు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో మాస పత్రిక, నెట్ టీవీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అదే విధంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు నేరుగా అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓరియంటేషన్ కార్యక్రమం పేరుతో కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది
Share this article :

0 comments: