విజయనగరం: జిల్లాలో హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులు పర్యటించనున్నారు. తీవ్రంగా నష్టం వాటిల్లిన పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పర్యటించి బాధితుల్ని పరామర్శిస్తారు. ఆదివారం మధ్యాహ్నం 12, ఒంటి గంట మధ్య జిల్లాకు రానున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి శనివారం రాత్రి వెల్లడించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టూర్ షెడ్యూల్...
తొలుత విజయనగరం మండలం కోరుకొండలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి గంట్యాడ మండలం పెదవేమలి, సిరిపురం మీదుగా బోనంగి చేరుకుంటారు. అక్కడ అరటి, వరి రైతుల నష్టాలను తెలుసుకుంటారు. రాత్రి విజయనగరంలో బస చేస్తారు. సోమవారం ఉదయం భోగాపురం మండలం దిబ్బలపాలెంలో పర్యటించి, అక్కడి కొబ్బరి రైతులను పరామర్శించాక పూసపాటిరేగ మండలం తిప్పలవలస వెళతారు. అక్కడ మత్స్యకారులను పరామర్శించాక పూసపాటిరేగ చేరుకుంటారు. అనంతరం చీపురుపల్లి మండలంలో పర్యటిస్తారు.

0 comments:
Post a Comment