
హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ తెలంగాణ నాయకుల సమావేశం జరగనుంది. వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్ష తన జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీల కన్వీనర్లు, 8 మంది ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొననున్నారు. ఈ నెల 16-20 తేదీల మధ్య జిల్లాల వారీగా నిర్వహించిన పార్టీ సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాలు, చర్చకు వచ్చిన అంశాలను సమీక్షించనున్నారు.
0 comments:
Post a Comment