పార్టీని బలోపేతం చేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీని బలోపేతం చేయండి

పార్టీని బలోపేతం చేయండి

Written By news on Saturday, October 18, 2014 | 10/18/2014


పార్టీని బలోపేతం చేయండి
నిజామాబాద్ అర్బన్: గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు పార్టీ బాగా ఉండేదని, మళ్లీ ఆ స్థాయికి తెచ్చేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని అన్నారు. రాబోయే 5,6 నెలలలో పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాలన్నారు.

శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ జిల్లా పార్టీ సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడారు. జిల్లా, మండల కేంద్రాలలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పా రు. అందుకోసం జిల్లాలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. గతంలో  పార్టీలో ఉండి ఇప్పుడు స్తబ్ధంగా ఉన్నవారిని, పాత నాయకులను తిరిగి పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించేలా చూస్తామన్నారు. ఇటువంటి నాయకుల జాబితాను  నియోజకవర్గాలవారీగా తయారు చేసి తనకు అందజేయాల ని జిల్లా నాయకులను కోరారు. ముందుగా ఈ నాయకులతో తాను మాట్లాడి, ఆ తర్వాత పార్టీ పెద్దలతో కూడా మాట్లాడిస్తానని చెప్పారు. నెలరోజులో జిల్లాస్థాయిలో ఒక సదస్సును నిర్వహించాలని సూచించారు.

ప్రజా సమస్యలపై స్పందించండి
కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కూలీల సమస్యలపై దృష్టి సారించాలని పొంగులేటి పేర్కొన్నారు. వారి వెన్నంటే ఉంటూ సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజల కు అందుబాటులో ఉండాలని, వారి అవసరాలను గుర్తించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై నిఘా ఉంచాలన్నారు. వెంటనే పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని, గ్రామగ్రామాన కమిటీలను వేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరలోనే కమిటీలను నియమించాలన్నారు.

కమిటీలు చరుకుగా పని చేసేలా తగిన చర్యలు తీసుకోవాల న్నా రు. జిల్లాలోనివారికే పార్టీలో ప్రాధాన్యతనివ్వాల ని, చురుకుగా పనిచేసే వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని ఈ సందర్భంగా కొందరు నాయకులు కోరా రు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని రాష్ట్ర నాయకులు హామీనిచ్చారు. ఈ భేటీలో నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి నాయుడు ప్రకాష్, ప్రత్యేక ఆహ్వానితుడు గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్రపార్టీ నాయకులు కొండారాఘవరెడ్డి, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, నిజామాబాద్ రూరల్ నాయకులు గంగారెడ్డి,సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.


Share this article :

0 comments: