
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హత్యారాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతిలో భూమన మాట్లాడుతూ... చంద్రబాబు ఓ పథకం ప్రకారమే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులపై దాడులు, హత్యలు చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుది మొదటి నుంచి హత్య రాజకీయమేనని గుర్తు చేశారు. 1999 నుంచి 2004 మధ్య కాలంలో 400 మంది హత్యకు గురయ్యారని... కానీ ఒక్క ఎఫ్ ఐఆర్ కూడా నమోదు కాలేదని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన నిందితులకు సాక్షాత్తూ టీడీపీ కార్యాలయంలో వసతి కల్పించిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హత్యరాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. తమ పార్టీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తామంతా అండగా నిలుస్తామని భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
0 comments:
Post a Comment