
గురువారం ఆయన కదిరిలో తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సిద్దమయ్యారని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి వంత పాడే కొన్ని పత్రికలు చేసే గోబెల్స్ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తమకు పార్టీలో పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో తామెంతో చనువుగా మాట్లాడతామన్నారు. ప్రాణమున్నంత వరకూ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి రాగానే ఆధార్ అనే పదమే లేకుండా చేస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇప్పుడు అదే ఆధార్ పేరుతో అనేక మందికి సామాజిక పింఛన్లు అందకుండా చేశారన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని, ఈ స్థానంలో వైఎస్ విజయమ్మ పోటీ చేయాలని ఉన్నారని కదిరిలో కొందరు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయం మా పార్టీలో ఏ రోజూ చర్చకు రాలేదన్నారు. కదిరిలో తెలుగుదేశం పార్టీని ఓడించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున కదిరిలో ఓడిపోయిన మొదటి వ్యక్తిగా కందికుంట వెంకట ప్రసాద్ నిలిచిపోతారన్నారు.
ఓటమిని జీర్నించుకోలేక మాట్లాడే మాటలివి. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు లేనిపోని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకుంటే మంచిదన్నారు. సమావేశంలో మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వజ్రభాస్కర్‌రెడ్డి, ఆ పార్టీ కౌన్సిలర్లు రాజశేఖర్‌రెడ్డి, కిన్నెర కళ్యాణ్, ఖాదర్‌బాషా, జిలాన్, మైనుద్దీన్, శివశంకర్‌నాయక్, కిరణ్ షౌకత్, ఆల్ఫా ముస్తఫా, మండల కన్వీనర్ లింగాల లోకే శ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మిరంగారెడ్డి, కుర్లిశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment