
గుంటూరు: ప్రజలను మోసం చేయాలనే తప్ప.. సేవ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రైతు సాధికారిక సంస్థకు కేటాయించిన 5 వేల కోట్లు ఏమూలకు సరిపోతాయని అంబటి ప్రశ్నించారు.
87 వేల కోట్ల అప్పులుంటే అందులో నాలుగో వంతు వడ్డీ కూడా కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు అసమర్ధ పాలన కారణంగా రైతులు బీమా సౌకర్యాన్ని కోల్పోయారని, స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేస్తూ డ్వాక్రా రుణాల మాఫీని కూడా చేయడం లేదని అంబటి ఆరోపించారు.
నారావారు నారాసురుడా లేక నరకా సురుడా అని అని ఎద్దేవా చేశారు. కడుపు మండిన రైతులు, స్త్రీశక్తిని ఎదుర్కొక తప్పదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతున్నాయని అంబటి మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని స్థలాలు ఆక్రమించుకుంటుంటే, ఎమ్మెల్యే బొడ్డేడ ప్రసాద్ నకిలీ వ్యక్తులతో ఇంటర్ పరీక్షలు రాయిస్తున్న అంశాలను అంబటి మీడియాకు వివరించారు. టీడీపీ పాలనను, ప్రజా ప్రతినిధుల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు.
0 comments:
Post a Comment