వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా అలా విసుక్కున్న దాఖలాలు ఉన్నాయా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా అలా విసుక్కున్న దాఖలాలు ఉన్నాయా ?

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా అలా విసుక్కున్న దాఖలాలు ఉన్నాయా ?

Written By news on Friday, October 31, 2014 | 10/31/2014


పథకం ప్రకారమే దుష్ర్పచారం
కడప కార్పొరేషన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక పథకం ప్రకారం దుష్ర్పచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని అపూర్వ కళ్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావే శానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడని, ఎదురుప్రశ్న వేస్తారన్నారు. కొన్నిసార్లు విసుక్కుంటాడని తెలిపారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా అలా విసుక్కున్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన వైఫల్యాలను అధికారులపైకి నెట్టేయగల సమర్థుడన్నారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలో సుమారు 200 వాగ్ధానాలు గుిప్పించారని, వాటిలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. పార్టీకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించుకుని సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జిల్లా కార్యవర్గాన్ని, అనుబంధ సంఘాల కార్యవర్గాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. పభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రైతులు, మహిళలు, పౌరులకు కలుగుతున్న నష్టాన్ని విశదీక రించాలన్నారు.

అన్ని నియోజకవర్గాలు తిరిగి నవంబర్ 5న తలపెట్టే ధర్నాలను  విజయవంతం చేయడానికి ఒకరికి బాధ్యతలు అప్పగించాలన్నారు.  పర్యవేక్షణ కమిటీ సభ్యులు  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలను నమ్మి దగాపడిన వర్గాలకు ప్రభుత్వ విధానాలను విడమరిచి చెప్పాల్సిన బాధ్యత వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై ఉందన్నారు. చంద్రబాబు  రైతులకు రుణమాఫీ చేస్తానని భ్రమ క ల్పించారని, తొలి సంతకానికి అర్థం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు 5 సంతకాలు, మూడు గ్రిడ్‌లు, 7 శ్వేతపత్రాలు, 12 కారిడార్లు అంటూ వరాల జల్లు కురిపించారన్నారు. ఆ వరాల అమలుకు 36 కమిటీలు వేశారన్నారు.

అయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. వాగ్ధానాల వైఫల్యాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రకెక్కడం ఖాయమన్నారు. ఈ ప్రభుత్వం రైతుల నోటికి పాలపీక, చేతికి బాండ్లు, చెవిలో పూలు పెడుతోందని విమర్శించారు. జిల్లా పరిశీలకులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లుగా రైతు రుణమాఫీ వాగ్దానంతో అధికారంలోకి వచ్చారన్నారు.  వైఎస్ జగన్ పడిన బాధలు, ప్రజలకోసం ఆయన చేసిన ఉద్యమాలు ఎవరూ చేయలేదని తెలిపారు.  అంతకుముందు  వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, హుధూద్ తుఫాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కోసం రెండు నిముషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ కె. సురేష్‌బాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు, డీసీసీబీ  ఛెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఛైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా, నాయకులు ముక్తియార్, మునెయ్య, కో ఆప్షన్ సభ్యులు ఎంపీ సురేష్, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు పత్తిరాజేశ్వరి, పులి సునీల్, కరీముల్లా, బి. అమర్‌నాథ్‌రెడ్డి, టీపీ  వెంకటసుబ్బమ్మ, ఎస్‌ఎండీ షఫీ, నారు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: