కార్యకర్తలకు అండగా నిలుస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్యకర్తలకు అండగా నిలుస్తాం

కార్యకర్తలకు అండగా నిలుస్తాం

Written By news on Wednesday, October 29, 2014 | 10/29/2014

కార్యకర్తలకు అండగా నిలుస్తాం
 తణుకు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, నాయకులకు పార్టీ అధిష్టానం అండగా నిలుస్తుందని, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పిలుపునిచ్చారు. మండలంలోని పైడిపర్రులో గల పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

 పార్టీ కోసం పనిచేసి కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతీ కార్యకర్తను వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు. ప్రతీ కార్యకర్త సూచనను పరిగణలోకి తీసుకొని వైఎస్‌ఆర్ సీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. తణుకు నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఆదుకున్న వ్యక్తి చీర్ల రాధయ్య అని, మనమంతా ఆయనకు అండగా నిలుద్దామన్నారు. మోసపూరిత వాగ్దానాలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గద్దెనెక్కారని, రుణమాఫీ తీరు ఎలా ఉందో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని అన్నారు.

 ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఉందన్నారు.  మహిళలు, రైతుల తరఫున వచ్చే నెల 5వ తేదీ నుంచి మండల కార్యాలయాల వద్ద చేపట్టే ధర్నాలను విజయవంతం చేయాలన్నారు. నరసాపురం పార్లమెంటరీ నాయకులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో జరిగే అవకతవకలను అరికట్టి ప్రజలకు సక్రమంగా పథకాలు అందేలా కార్యకర్తలు సమీక్షించాలన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల నుంచి ప్రజలను కాపాడాలని పిలుపునిచ్చారు. తణుకు నియోజకవర్గ కన్వీనర్ చీర్ల రాధయ్య మాట్లాడుతూ రాజన్న బిడ్డ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్ సీపీని ప్రజలు ఆదరించాలని భావించినా, చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు.

 నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు చల్లబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు అండగా కార్యకర్తలు నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ బీసీ సంఘ నాయకుడు గంటా ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు మాటకు నిలబడే వ్యక్తి కాదని, జన్మభూమి వలన ప్రచారమే తప్ప ప్రజలకు ఒరిగిందే మీ లేదన్నారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, తణుకు నియోజకవర్గ నాయకులు నార్గన సత్యనారాయణ, వెలగల అమ్మిరెడ్డి, గంధం బాబ్జి, కరుటూరి సర్వేశ్వరరావు, చుక్కా లివింగ్ స్టన్, కొండే నాగవేణి, కేతా గౌరీ పార్వతి, మెహర్ అన్సారీ, మద్దిరాల రాంసతీష్, చింతలపూడి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: