జిల్లాలవారీగా వైఎస్ఆర్ సీపీ సమీక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జిల్లాలవారీగా వైఎస్ఆర్ సీపీ సమీక్షలు

జిల్లాలవారీగా వైఎస్ఆర్ సీపీ సమీక్షలు

Written By news on Friday, October 24, 2014 | 10/24/2014

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనుంది. ఇందుకోసం పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన బృందం జిల్లాల్లో పర్యటించనుంది.  పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి  ప్రసాదరాజు, విజయ సాయిరెడ్డిలతో వైఎస్ఆర్ సీపీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 25న కృష్ణా, 26న గుంటూరు, 27న ప్రకాశం, 28న నెల్లూరు, 29న తిరుపతి, 30 వైఎస్ఆర్ జిల్లా, 31న అనంతపురం, నవంబర్ 1వ తేదీన కర్నూలు జిల్లాల్లో ఈ కమిటీ పర్యటించనుంది.

నవంబర్ 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నేతలతో చర్చిస్తామని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి తెలిపారు. రుణమాఫీ, పెన్షన్లు, ప్రభుత్వ హామీలపై జిల్లా నేతలతో సమీక్షించనున్నట్లు చెప్పారు. మరోవైపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ధర్మాన ప్రసాదరావు, పార్ధసారధి, జ్యోతుల నెహ్రు పర్యటిస్తారని ఉమ్మారెడ్డి వెల్లడించారు.
Share this article :

0 comments: