skip to main |
skip to sidebar
Home »
» నేడు జగన్ పర్యటన
నేడు జగన్ పర్యటన
విశాఖపట్నం సిటీ: హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన శనివారం అనకాపల్లి దరి తుంపాల గ్రామంలో తుపాను బీభత్సానికి పాడైన చెరకు తోటలను సందర్శిస్తారు. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.పాడేరు దరి మోదపల్లి, ఇరడాపల్లిలోని కాఫీ తోట లు, అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని నందివలస ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తారు. తుపాను వల్ల గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారని, జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
0 comments:
Post a Comment