ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం

ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం

Written By news on Friday, October 24, 2014 | 10/24/2014


ఆళ్లగడ్డ : అనుకున్నట్లుగానే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల ప్రియ ఎన్నిక లాంఛనప్రాయమైంది. దీనిపై ఎన్నికల అధికారులు మరికొద్ది సేపట్లో అఖిల ప్రియ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. దాంతో  ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సాంకేతిక కారణాలతో ఉప ఎన్నికకు ఆలస్యంగా పచ్చజెండా ఊపింది. దీంతో ఈనెల 17న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిల ప్రియ నామినేషన్ దాఖలు చేశారు.  నేటితో నామినేషన్ల గడువు ముగియటంతో బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
Share this article :

0 comments: